సంగారెడ్డిలో అపార్ట్‌మెంట్‌ కూల్చివేతకు సిద్దమైన హైడ్రా!

April 11, 2026
img

ఈరోజు ఉదయం హైడ్రా సిబ్బంది జేసీబీలతో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలోని క్రిష్ణారెడ్డిపేటకు చేరుకున్నారు. అక్కడ క్రిస్టల్ డెవెలపర్స్ నిర్మించిన ఓ భారీ అపార్ట్‌మెంట్‌ని కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నారు. దానిలో సుమారు 50కి పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.

హైడ్రా సిబ్బంది వచ్చి వారిని తక్షణం ఇళ్ళు ఖాళీ చేయాలని హెచ్చరిస్తుండటంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. హైడ్రా సిబ్బందికి, వారికీ మద్య వాగ్వాదాలు జరుగుతుండటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

తమ అపార్ట్‌మెంట్‌ అక్రమ కట్టడమైతే దానికి జిహెచ్‌ఎంసి, టౌన్ ప్లానింగ్, విద్యుత్ తదితర శాఖలు నిర్మాణానికి ఎందుకు అనుమతించాయని దానిలో నివసిస్తున్నవారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయం కోర్టులో తేల్చుకోవాలని వాటితో తమకు సంబంధం లేదని హైడ్రా సిబ్బంది నచ్చజెప్పి ఇళ్ళు ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలుసుకొని చుట్టుపక్కల వారు అక్కడికి తరలి వస్తుండటంటతో ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

Related Post