అమీన్‌పూర్‌లో ఓ పక్క కన్నీళ్ళు... మరోపక్క సంబురాలు!

April 11, 2026
img

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలంలో నేడు రెండు భిన్నమైన పరిణామాలు జరిగాయి. హైడ్రా సిబ్బంది కృష్ణారెడ్డి పేట వద్ద  క్రిస్టల్ డెవెలపర్స్ నిర్మించిన ఓ భారీ అపార్ట్‌మెంట్‌ని కూల్చివేశారు. దానిలో నివసిస్తున్న 50 కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ హడావుడిగా ఇళ్ళలో సామాను బయటకు తెచ్చుకున్నారు. తమ కష్టార్జితంతో కొనుకొన్న ఇళ్ళను కూల్చివేసి తమని రోడ్డున పడేశారంటూ హైడ్రా సిబ్బందికి, ప్రభుత్వానికి శాపాలు పెట్టారు. 

అదే సమయంలో అమీన్‌పూర్‌ వాసులు సిఎం రేవంత్ రెడ్డి చిత్ర పఠానికి పాలాభిషేకం చేసి, టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. సుమారు 4,000 మంది పేరిట రిజిస్టర్ అయిన ఆ భూములు కబ్జాకు గురైతే వాటి కోసం దాదాపు 40 ఏళ్ళుగా న్యాయపోరాటం చేస్తున్నామని కానీ ఫలించాలేదన్నారు.

కానీ ఒక్క పిర్యాదుతో హైడ్రా వచ్చి అక్రమ కట్టడాలను కూల్చివేసి ఆ భూములను స్వాధీనం చేసుకుందని సంతోషం వ్యక్తం చేశారు. దీంతో తమ భూములు తమకు దక్కుతాయని ఆశ పడుతున్నామన్నారు. సిఎం రేవంత్ రెడ్డి హైడ్రాని ఏర్పాటు చేసి దానికి తగిన అధికారాలు కట్టబెట్టడం వల్లనే ఇది సాధ్యపడిందంటూ అమీన్‌పూర్‌ వాసులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 

Related Post