రాకాలో ఒకరు, ఇద్దరూ కాదు.. నలుగురు హీరోయిన్లు!

April 14, 2026


img

కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘రాకా’పై ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే భారీ అంచనాలు సృష్టించారు. ఇప్పుడీ సినిమాలో ఒకరు ఇద్దరూ కాదు ఏకంగా నలుగురు హీరోయిన్స్ చేస్తున్నారని టాక్!

ఈ సినిమాలో మొదట బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పడుకొణే ఒక్కరే హీరోయిన్‌ అనుకుంటే, ఇప్పుడు రష్మిక మందన, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం దర్శక నిర్మాతలు ఇంకా అధికారికంగా ద్రువీకరించాల్సి ఉంది. ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా కీలకపాత్ర చేస్తున్నారు. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముంబయిలో జరుగుతోంది. దీనిలో అల్లు అర్జున్‌ ‘రాకా’ అనే రాక్షసుడిగా, హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 40 శాతం షూటింగ్‌ పూర్తయినట్లు సమాచారం. 2027 వేసవిలో రాకా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో నటిస్తున్న ఇతర నటీనటులు, దీనికి పని చేస్తున్న సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. 

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ సుమారు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో 9 భారతీయ భాషల్లో రాకా నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష