వి.మునిరాజు దర్శకత్వంలో తీసిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఈ నెల 17న విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో నేడు ట్రైలర్ వదిలారు. కొత్తగా టీవీలు వచ్చినప్పుడు ఆ రోజుల ఊళ్ళలో పరిస్థితులు ఎలా ఉండేవో కళ్ళకు కట్టినట్లు ట్రైలర్‌లో చూపారు.
ఈ సినిమాతో కెమెరా మ్యాన్ సాయి తేజ హీరోగా పరిచయం అవుతున్నాడు. అతనికి జోడీగా వేద జలందర్ (వేదశ్రీ) నటించింది. మరో విశేషమేమిటంటే కిరణ్ అబ్బవరం ఈ సినిమా నిర్మాతలలో ఒకరు.
చాలా తక్కువ బడ్జెట్‌లో గ్రామీణ నేపధ్యంతో తీసిన ఈ ప్రేమకథా చిత్రంలో దాదాపు అందరూ కొత్త నటులే. కానీ ట్రైలర్‌లో అందరూ ఆదరగోట్టేశారు. ఈ సినిమాలో ప్రదీప్ కొట్టే, స్వాతి కరీంరెడ్డి, అమ్మ రమేష్, వడ్డాది సత్యనారాయణ, తేజ విహాన్, టీవీ రామన్, మాధవి ప్రసాద్, చిట్టిబాబు, అన్షుమన్, లతీష్ కీలపట్టు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు దర్శకత్వం: వి.మునిరాజు, సంగీతం: వంశీకాంత్ రేఖన, కెమెరా: అక్షయ రామ్ పోడిశెట్టి, ఆర్ట్: సుదీర్ మాచెర్ల చేశారు.
కేఎ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిరణ్ అబ్బవరం, తేజేశ్వర్ కలిసి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదల కాబోతోంది.