సత్యదేవ్ హీరోగా ‘రావు బహదూర్’ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు తొలిపాట విడుదల ప్రకటన చేయబోతున్నారు.
ఈ సినిమా నిర్మాణంలో మహేష్ బాబు కూడా భాగస్వామిగా ఉన్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మహాయాన బ్యానర్లపై చింత గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కలిసి ‘రావు బహదూర్’ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో సత్యదేవ్ వృద్ధుడైన ‘రావు బహదూర్’గా నటిస్తున్నారు. రావు బహదూర్ వేషంలో సత్యదేవ్‌ని గుర్తుపట్టడం కూడా కష్టమే. ఈ సినిమాఫస్ట్ లుక్ పోస్టర్‌లో చుట్టూ నెమలి పించం, పువ్వులు, తేనెటీగలు, పైకి ఎగబాకుతున్న అబ్బాయిలను చూపించడం ఆసక్తికరంగా ఉంది. కానీ చూచాయగా కధ చెప్పినట్లే ఉంది.
విలాస పురుషుడైన ‘రావు బహదూర్’కి సంతానం విషయంలో కలిగిన అనుమానం లేదా సమస్య ఈ సినిమా కధ అనిపిస్తుంది. ఈ ఊహ అవునో కాదో తెలియాలంటే ఆగస్ట్ 15న టీజర్ విడుదలయ్యే వరకు ఓపిక పట్టాల్సిందే. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినినిమాకు సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: కార్తీక పర్మర్ చేస్తున్నారు.