హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమాన తయారీ సంస్థ

April 08, 2026
img

విమానాల తయారీలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘లాక్ హీడ్ మార్టిన్’ హైదరాబాద్‌లో తమ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టిమ్‌ రైఫిల్ నేడు తన బృందంతో కలిసి హైదరాబాద్‌ వచ్చి సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సిఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ‘లాక్ హీడ్ మార్టిన్’ ప్రతినిధులతో సమావేశమైయ్యారు. అప్పుడే తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆహ్వానించగా ఇప్పుడు దాని కోసం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు వచ్చారు. 

టిమ్‌ రైఫిల్ ఏమన్నారంటే “సి130జె సూపర్ హెర్క్యూలిస్ (భారీ కార్గో విమానం) విడిభాగాలు బిగించే ఫైనల్ అసెంబ్లీ లైన్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తాము. దీనిలోఎఫ్-16 యుద్ధ విమానాల రెక్కలు కూడా తయారు చేస్తాము. ఇక్కడ తయారై బిగించబడిన విమాన భాగాలు విదేశాలకు ఎగుమతి అవుతాయి,” అని అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే ఈ ప్లాంట్‌లో టాటా సంస్థ ప్రధాన భాగస్వామిగా ఉంటుంది. కనుక ఈ ప్లాంట్ పేరు టాటా లాక్ హీద్ మార్టిన్ ఏరో స్ట్రక్చర్ లిమిటెడ్.  దీనిలో అత్యంత నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగాలు లభిస్తాయి.

Related Post