ఈసారి మరింత ఘనంగా అవతరణ దినోత్సవ వేడుకలు

May 31, 2026


img

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి జూన్‌ 2 నాటికి 12 సం.లు పూర్తవుతాయి. అంటే అప్పుడే ఒక పుష్కర కాలం గడిచిపోయిందన్న మాట! ఈ ఏడాది మరింత ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చకా చకా ఏర్పాట్లు చేస్తోంది. 

జూన్‌ 2న ఉదయం సిఎం రేవంత్ రెడ్డి గన్ పార్కులో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌ చేరుకొని 8.30 గంటలకు జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ప్రారంభిస్తారు. 

అదే సమయంలో 33 జిల్లాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జిల్లా కేంద్రాలలో అమరవీరుల స్థూపాల వద్ద నివాళులు అర్పించి జాతీయ జెండా ఎగురవేస్తారు. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాలకు పూల మాలలు వేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో పాల్గొంటారు. 

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయంతో పాటు శాసనసభ, జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలను విద్యుదీపాలతో అందంగా అలంకరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల స్థాయిలో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అన్ని పార్టీలు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు కలిసి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కనుక రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడూ తీవ్ర భావోద్వేగాలతోనే సాగుతుంటుంది.


Related Post