జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నప్పుడు తెలుగు ప్రజల అభిమాన నటుడు, మాజీ సిఎం ఎన్టీఆర్ విగ్రహం అమీర్‌పేట వద్ద ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. నాడు ఇచ్చిన మాట ప్రకారం అమీర్‌పేట వద్ద మైత్రీవనం సర్కిల్లో నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేశారు.
సిఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్, అజహారుద్దీన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎన్టీఆర్ కుమారులు నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన్ కృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నటుడు మంచు మనోజ్, ఎన్టీఆర్ అభిమానులు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ని ఓ పార్టీ, ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చూడరాదన్నారు. అయన గొప్ప నటుడు, దర్శకుడు, తెలుగు భాషాభిమాని, ఆ నాడే రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి నిరుపేదల ఆకలి తీర్చిన మానవతావాదిగా చూడాలన్నారు.