వెంకీ అట్లూరి దర్శకత్వం ప్రముఖ కోలీవుడ్ నటుడు సూర్య, మమితా బైజు జంటగా చేస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. ఆగస్ట్ 14న విడుదల కాబోతోందని తెలియజేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు.
తనకంటే వయసులో 20 ఏళ్ళు పెద్దవాడైన హీరోని వెంటపడి ప్రేమింఛి పెళ్ళి చేసుకోవాలనే అందమైన హీరోయిన్ అందమైన లవ్ స్టోరీ ఇది. ఇటీవల విడుదలైన టీజర్‌లో చాలా సింపుల్‌గా బాగుంది. ఇప్పుడీ పోస్టర్ కూడా అంతే సింపుల్‌గా చాలా బాగుంది. ఈ సినిమాలో రవీనా టండన్, రాధిక ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కథ, దర్శకత్వం: వెంకీ అట్లూరి, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: నిమిష రవి, ఎడిటింగ్: నవీన్ నూలి, కోరియోగ్రఫీ: శేఖర్ విజే, విజయ్ బిన్నీ, స్టంట్స్: వి వెంకట్ చేస్తున్నారు.
శ్రీకర్ స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ సినిమాని తెలుగు, తమిళంలో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 14న విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.