సమ్మర్ హాలీడేస్‌లో కుండలు బద్దలు కొడితే ఎలా సాయి రాజేష్?

May 28, 2026


img

సమ్మర్ హాలీడేస్ టీజర్‌ రిలీజ్‌ ఫంక్షన్‌లో ముఖ్య అతిధిగా పాల్గొన్న నిర్మాత దిల్ రాజు సినీ పరిశ్రమ పరిస్థితి ఏమీ బాగోలేదని స్పష్టంగా చెప్పేశారు. తర్వాత మాట్లాడిన దర్శకుడు సాయి రాజేష్ మరిన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. 

“సినిమాలు తీస్తున్నవారు ఇప్పుడు యూట్యూబ్‌లో లైక్స్, వ్యూస్ కొనేస్తున్నారు. సోషల్ మీడియాలో నెగెటివ్ వ్యూస్ రాకుండా వాటినీ కొనేసి కేవలం పాజిటివ్ వ్యూస్ వచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఏది అసలైన అభిప్రాయమో ఏది నకిలీదో కూడా తెలుసుకోలేము. 

ఒకవేళ బేబీ సినిమా ఇప్పుడు విడుదల చేసి ఉంటే అప్పటి కలెక్షన్స్‌లో 50 శాతం కూడా వచ్చి ఉండేది కాదు. సోషల్ మీడియా అంతగా దిగజారిపోయింది. ఇప్పుడు సినిమాలు తీయాలంటేనే భయమేస్తోంది. ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో ఏది నచ్చాదో తెలీదు. 

మన సినిమా గురించి సోషల్ మీడియాలో ఏం వ్రాస్తారో, సినిమాకి ఎలాంటి రివ్యూలు వస్తాయో అనే భయం. చి సమ్మర్ హాలీడేస్ వంటి చక్కటి సినిమాలు తీసినా ఇటువంటి అవాంచనీయ వాతావరణంలో విడుదల చేయాలంటే భయం వేస్తోంది. ఇప్పటికే అందరూ కలిసి క్రైమ్‌, థ్రిల్లర్ వంటి కొన్ని జోనర్లను చంపేశారు. మిగిలిన రెండు మూడు జోనర్లను కూడా చంపేసేలా ఉన్నారు. 

కేవలం రెండు మూడేళ్ళలోనే సోషల్ మీడియాలో ఇంత మార్పు వచ్చింది. ఇప్పుడు అదే సినీ పరిశ్రమని శాశించే స్థాయికి ఎదిగిపోయింది,” అని సాయి రాజేష్ అన్నారు.                 

(Video Courtesy: Great Andhra)

Related Post

సినిమా స‌మీక్ష