కర్ణాటక సిఎం సిద్దరామయ్య నేడు రాజీనామా?

May 28, 2026


img

కర్ణాటక సిఎం సిద్ధరామయ్య నేడు తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. సిఎంవో కూడా ధృవీకరించింది. రాజీనామా లేఖను సమర్పించేందుకు అయన ఈరోజు ఉదయం 10 గంటలకు గవర్నర్‌ థాపర్ చంద్ గెహ్లాట్ అపాయింట్మెంట్ కోరారు.

కానీ అయన కుటుంబ సమేతంగా ముంబాయికి వెళ్ళడంతో సిఎం సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను గవర్నర్‌ కార్యదర్శికి సమర్పించబోతున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం డెప్యూటీ సిఎంగా ఉన్న డీకే శివకుమార్ అసమ్మతి, ఒత్తిడి మేరకు కాంగ్రెస్‌ అధిష్టానం సిద్ధరామయ్య చేత రాజీనామా చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక డీకే శివ కుమార్‌ సిఎంగా నియమించబోతున్నట్లు తెలుస్తోంది.

కానీ ఇటీవల తమిళనాడు గవర్నర్‌ టీవీకే పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయనీయకుండా ముప్పతిప్పలు పెట్టినట్లు, కర్ణాటక గవర్నర్‌ కూడా చేస్తే? పరిస్థితి ఏమిటని కాంగ్రెస్‌ పార్టీలో అంతర్మధనం సాగుతోంది.

గవర్నర్‌ తిరిగి వచ్చిన తర్వాత సిద్ధరామయ్య రాజీనామాని ఆమోదించి డీకే శివ కుమార్‌ లేదా మరొకరిని ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతించకపోయినా లేదా ఆలస్యం చేసినా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో చీలిక వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక సిద్ధరామయ్య రాజీనామా విషయంలో కాంగ్రెస్‌ పార్టీ బాగా ఆలోచించుకొని అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. 


Related Post