తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలకు సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులకు మద్య పర్సంటేజ్ విధానంపై ఏర్పడిన ప్రతిష్టంభనకు మెగాస్టార్ చిరంజీవి తాత్కాలికంగా తెర దించారు. మొన్న సోమవారం తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రతినిధులు, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు డి. సురేష్ బాబు, తెలంగాణ ఎఫ్.డీ.సి చైర్మన్ దిల్ రాజు, అల్లు అర్జున్ అరవింద్, సునీల్ నారంగ్, కేఎల్ నారాయణ పలువురు నిర్మాతలు ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడారు.
అందరి సమస్యలు విని దీని పరిష్కారం కోసం వేసిన సబ్ కమిటీ సభ్యులతో నేడు మరోసారి మాట్లాడారు. ఈ సమస్యకి శాశ్విత పరిష్కారం చేద్దామని కానీ ముందు అనుకున్న ప్రకారం చర్చలకు కొంత సమయం ఇవ్వాలని చిరంజీవి కోరారు. ఆయన సూచనని గౌరవిస్తూ జూన్ నెలాఖరు వరకు పెద్దితో సహా అన్ని సినిమాలను పాత రెంటల్ పద్దతిలోనే ప్రదర్శించేందుకు అంగీకరించారు.
కనుక జూన్ 4న పెద్ది విడుదలకు లైన్ క్లియర్ అయిపోయినట్లే. పెద్దితో పాటు జూన్‌లో విడుదలవుతున్న పలు సినిమాలకు అవరోధాలు తొలగిపోయాయి.