సినీ పంచాయితీ చిరంజీవి వద్దకు..

May 27, 2026


img

టాలీవుడ్‌ నిర్మాతలకు తెలంగాణ సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లకు మద్య పర్సంటేజ్ విధానంపై ఏర్పడిన ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. కనుక తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రతినిధులు, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు డి. సురేష్ బాబు, తెలంగాణ ఎఫ్‌.డీ.సి చైర్మన్‌ దిల్ రాజు, అల్లు అర్జున్‌ అరవింద్, సునీల్ నారంగ్, కేఎల్ నారాయణ పలువురు నిర్మాతలు సోమవారం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి ఆయనతో సమావేశమయ్యారు.

వారు చెప్పిన సమస్యలు, వివరాలు అన్నీ విన్న తర్వాత చిరంజీవి ఈ సమస్య తీవ్రతని అర్ధమైందని, దీని పరిష్కారం కోసం వేసిన సబ్ కమిటీ నివేదిక కూడా చూసిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో మరోసారి కూర్చొని మాట్లాడుకుందామన్నారు.

ఇది సినీ పరిశ్రమలో ఏ ఒక్కరి సమస్యో కాదు అందరి సమస్య అన్నారు. కనుక ఎవరూ నష్టపోకుండా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం అవసరమని చిరంజీవి అన్నారు. జూన్‌ నెలాఖరులోగా ఈ సమస్య పరిష్కారం అయ్యేందుకు నా వంతు కృషి చేస్తానని చిరంజీవి హామీ ఇచ్చారు.

అయితే మరో నెల రోజులు కాకుండా రెండు రోజులలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చెప్పడం విశేషం. 

రెండు రోజులలో ఈ సమస్య పరిష్కారమైతే తెలంగాణలో పెద్ది సినిమా ప్రదర్శనకు ఎటువంటి ఆటంకం ఉండదు. కానీ చిరంజీవి చెప్పినట్లు నెల రోజులు సమయం అంటే సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు అంగీకరిస్తారో లేదో?  


Related Post

సినిమా స‌మీక్ష