సినిమా పేరు: సింగిల్ రాజు.. ఇదిగో టైటిల్‌ పోస్టర్!

May 26, 2026


img

పెద్ద సినిమాలకు పవర్ ఫుల్ పేర్లు పెడుతుంటారు. కానీ చిన్న సినిమాలకు చక్కటి క్యాచీ పేర్లు పెడుతుంటారు. అటువంటిదే సింగిల్ రాజు కూడా. ఎస్ఎస్ వర్మ దర్శకత్వంలో విశ్వస్, దివ్య, మౌనిక ప్రధాన పాత్రలు చేసిన ఈ సినిమా టైటిల్‌, పోస్టర్, ఫస్ట్ గ్లిమ్స్‌ సోమవారం హైదరాబాద్‌, ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. 

ఈ సందర్భంగా దర్శకుడు వర్మ మీడియాతో మాట్లాడుతూ, “ఇదొక అందమైన పల్లెటూరి ప్రేమ కథా చిత్రం. ప్రేక్షకులను అలరిస్తుందని మాకు పూర్తి నమ్మకం ఉంది,” అని అన్నారు. ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల సినిమా టైటిల్‌ పోస్టర్, ఫస్ట్ గ్లిమ్స్‌ విడుదల చేశారు.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ఎస్ఎస్ వర్మ, పాటలు: గోరేటి వెంకన్న, మిట్టపల్లి సురేందర్, కెమెరా: సాయితేజ, నితీష్, ఎడిటింగ్: యూనిక్ బొజ్జపల్లి చేస్తున్నారు.  



Related Post

సినిమా స‌మీక్ష