పెద్ది సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుంటే తెలంగాణ ఎగ్జిబిటర్స్ మళ్ళీ మొండికేయడంతో నిర్మాత బండ్ల గణేష్ వారికి ఓ విజ్ఞప్తి చేశారు. “ప్రస్తుతం సినీ పరిశ్రమ చాలా కష్టాల్లో ఉంది. ఇలాంటి సమయంలో పెద్ది లాంటి ఒక పెద్ద సినిమా రిలీజ్ అవడం, హిట్ అవడం చాలా ముఖ్యం.
ఇలాంటి పెద్ద సినిమా ఆడితేనే సినీ పరిశ్రమలో పనిచేస్తున్న అందరికీ మేలు కలుగుతుంది. తెలుగు సినిమా గౌరవం, భవిష్యత్, థియేటర్లు, వేలాది సినీ కార్మికుల కుటుంబాల భవిష్యత్ అన్నీ ఈ సినిమాపైనే ఆధారపడున్నాయి. కనుక అందరూ పెద్ద మనసు చేసుకొని ఈ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి పెద్ది సినిమా విడుదలకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. సమస్యలను సినిమా రిలీజ్ తర్వాత కూడా పరిష్కరించుకోవచ్చు. అందుకు నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారు కదా?” అని అన్నారు.
చిన్న సినిమాల రిలీజ్‌కి సమస్యలు ఎదురైనప్పుడు కూడా బండ్ల గణేష్ వంటివారు మీడియా ముందుకు వచ్చి ఇలాగే మాట్లాడితే ఇప్పుడు ఆయన మాటలకు విలువ, గౌరవం ఉండేవి. కానీ అప్పుడు తెలియనట్లు మౌనంగా ఉండిపోయి, ఇప్పుడు ఇలా మాట్లాడితే ఆయన మాటలను ఎవరు వింటారు? ఎవరు నమ్ముతారు?