టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తాజా ఇంటర్వ్యూలో తండ్రి కేసీఆర్ పదేళ్ళ పాలనపై అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెపుతూ, “కేసీఆర్‌గారు తెలంగాణ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేశారు. ఈ విషయంలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ అయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యమ ప్రాధాన్యతలు మరిచి వేరే దిశలో ప్రయాణించడం వలన రెండు తరాల యువత నష్టపోయింది.
మన ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్ళు, నిధులు, నియామకాలు. దానిలో నియామకాల సంగతి పట్టించుకోలేదు. ఎంతసేపు విదేశీ కంపెనీలను రప్పించి పెట్టుబడులు పెట్టించి వాటిలో యువతకు ఉద్యోగాలు కల్పించడంపైనే దృష్టి పెట్టారు తప్ప గ్రూప్ ఉద్యోగాల భర్తీని పట్టించుకోలేదు.
ఆ కారణంగా గ్రామాల నుంచి హైదరాబాద్ వచ్చి ఏళ్ళ తరబడి ఆ ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటూ, బ్రతకడం కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పదేళ్ళపాటు యువత ఎదురుచూపులు చూశారు. కానీ గ్రూప్ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వలన వారందరూ తీవ్రంగా నష్టపోయారు. ఈ పొరపాటు వలన ఒక తరం యువత జీవితాలు దెబ్బ తిన్నాయి కదా?
అలాగే సుమారు 1200 అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ కోసం వారు ప్రాణాలు త్యాగాలు చేస్తే, వారి కుటుంబాలను ఆడుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ ప్రభుత్వానిదే కదా? కానీ వాళ్ళని పట్టించుకోలేదు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి పదేళ్ళు చాలా అమూల్యమైనవి. ఆ సమయంలో సరైన దిశలో అడుగులు వేసి ఉండి ఉంటే నేడు తెలంగాణ పరిస్థితి ఈవిధంగా ఉండేది కాదు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ళలోనే అన్ని రంగాలలో విఫలమైంది. కనుక కేసీఆర్ హయంలో తెలంగాణ ఎంతగా అభివృద్ధి జరిగినప్పటికీ జరిగిన తప్పుల గురించి నేను, భవిష్యత్ తరాలవారు కూడా మాట్లాడుతూనే ఉంటారు,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.
BRS హయాంలో చాలా మంచి జరిగింది... కానీ, నీళ్లు , నిధులు , నియామకాలు విషయాల్లో ఫెయిల్యూర్ అయ్యింది: TRS అధ్యక్షురాలు కవిత pic.twitter.com/14bUDggF8M
(Video Courtesy: Chota News App)