గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో మరో పెద్ద సినిమా... మరో మైలురాయిగా నిలిచిపోతుందని భావిస్తున్న ‘పెద్ది’ కోసం ప్రేక్షకులు, అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. జూన్ 3న ప్రీమియర్ వేసి, 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తారు. ప్రధాని మోడీ సైతం పెద్ది గురించి మాట్లాడటంతో ఈ సినిమాకి చాలా హైప్ ఏర్పడింది. పెద్ది రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున సినిమాలో ముఖ్యపాత్రలు చేసిన నటీనటులు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఇంకా హైప్ సృష్టిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో పల్లెటూరి గడుసు పిల్ల అచ్చియమ్మగా నటించారు. తాజా ఇంటర్వ్యూలో, “సాధారణంగా పల్లెటూరి అమ్మాయిలు అమాయకంగా ఉంటారని విన్నాను. కానీ అచ్చియమ్మ మాత్రం అందరిపై పెత్తనం చెలాయిస్తుంతుంది. ఈ పాత్రలో ఈ లక్షణమే నాకు చాలా ఆసక్తి కలిగించి నటించేలా చేసింది. అచ్చియమ్మ పాత్రని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. కనుక నా నటన ప్రేక్షకులకు నచ్చుతుందనే భావిస్తాను,” అని అన్నారు.