ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు హటాత్తుగా మంటలు అంటుకోవడం దగ్ధం అవడం పరిపాటిగా మారింది. వాటిలో ప్రయాణిస్తున్న వారు అదృష్టవంతులైతే ప్రాణాలతో బయటపడుతుంటారు లేకుంటే సజీవ దహనమైతుంటారు.
తాజాగా నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి ఇన్‌స్టాగ్రామ్ శివారు వద్ద హైవే రోడ్డుపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు అంటుకొని దగ్ధమైంది. అయితే డ్రైవర్ వెంటనే గమనించి బస్సుని రోడ్డు పక్కన నిలిపివేసి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో అందరూ బస్సులో నుంచి బయటపడ్డారు. వారు చూస్తుండగానే క్షణాలలో మంటలు బస్సంతా వ్యాపించి వారి కళ్ళ ముందే బస్సు దగ్ధమైంది.
హైదరాబాద్ నుంచి కాకినాడ బయలుదేరిన ఆ బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. వారి ఆయుష్షు ఇంకా మిగిలి ఉంది కనుక ఈ ఘోర ప్రమాదం నుంచి బయటపడగలిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలు ఆర్పేశారు. కానీ అప్పటికే బస్సు పూర్తిగా మంటల్లో కాలి దగ్ధమైపోయింది.