విజయ్‌ దేవరకొండ కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్‌

May 30, 2026


img

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం ఒకేసారి రౌడీ జనార్ధన పూర్తి చేయగానే శౌర్యువ్ దర్శకత్వంలో రణబాలి మొదలుపెడతారు. అది వచ్చే ఏడాది మార్చిలోగా విడుదలయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత ప్రముఖ దర్శకుడు కే. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా మొదలుపెట్టేందుకు విజయ్‌ దేవరకొండ ఇప్పటి నుంచే చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

వారిరువురూ ఇదివరకే ఈ సినిమా మొదలు పెట్టాలనుకున్నారు. కానీ కుదరలేదు. కనుక ఇప్పుడు చేస్తున్న ఈ రెండు సినిమాలు పూర్తవగానే అది మొదలుపెట్టాలనుకుంటున్నారు. గుర్రపు స్వారీ (హార్స్ రేసింగ్) క్రీడాంశం కథతో తీయబోతున్నట్లు సమాచారం. 

ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తీయాలనుకుంటున్నారు. ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ మడాక్ ఫిలిమ్స్ ఈ సినిమా నిర్మించే అవకాశం ఉంది. ఈ సినిమా గురించి చర్చించేందుకు విజయ్‌ దేవరకొండ, దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ కలిసి ముంబయి వెళ్ళారు. 


Related Post

సినిమా స‌మీక్ష