దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ చేస్తున్నారు. ఇంతవరకు సినీ దర్శకత్వానికే పరిమితమైన ఆయన తొలిసారిగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. సందీప్ రెడ్డి సమర్పణలో అయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ‘రోమాంచకం’ సినిమా టైటిల్ పోస్టర్ నేడు విడుదల చేశారు.
భద్రకాళి పిక్స్చార్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాతో వేణుగోపాల్ రెడ్డి దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా చేయబోతున్నారు. ఇదొక మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ అని సందీప్ రెడ్డి చెప్పారు. కానీ కథలో బలమైన భావోద్వేగాలు కూడా ఉన్నాయన్నారు. ఈ సినిమాకి సంగీతం: వాసుకి వైభవ్, కెమెరా: పవన్ పప్పుల చేస్తున్నారు.