కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్ళు పంచుకోవాలనే ఒప్పందం ప్రకారం సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేయగా ఆయన స్థానంలో సిఎంగా డీకే.శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈరోజు విధానసౌదలో జరిగిన సిఎల్పీ సమావేశంలో అయన పేరుని సిద్ధ రామయ్య ప్రతిపాదించగా, సిఎం పదవికి పోటీ పడిన పరమేశ్వర బలపరిచారు. కనుక డీకే.శివకుమార్ సిఎల్పీ నాయకుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైనందున నేడు గవర్నర్‌ని కలిసి, పార్టీ నిర్ణయాన్ని తెలియజేస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకి తనని ఆహ్వానించాల్సిందిగా కోరుతారు.
జూన్ 3న లోక్‌భవన్‌లోని గ్లాస్ హౌసులో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ ప్రకటించింది.