జనసేన అధినేత, ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ జూన్ 2న అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్‌లో ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం’ నిర్వహించబోతున్నారు. జనసేన పార్టీ సోషల్ మీడియాలో అధికారికంగా ఈ విషయం ప్రకటించింది.
పవన్ కళ్యాణ్ తెలంగాణలోనే జనసేన స్థాపించినప్పటికీ ఆయన ఏపీ రాజకీయాలకు షిఫ్ట్ అవడం, డెప్యూటీ సిఎం బాధ్యతలతో బిజీబిజీగా గడుపుతుండటం వలన ఇంతకాలం తెలంగాణలోని జనసేనకి సమయం కేటాయించలేకపోయారు. ఇటీవల ప్రొ.నాగేశ్వర్, కొందరు మీడియా ప్రతినిధులు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయకపోయుంటే తెలంగాణ జనసేన గురించి ఆలోచన చేసి ఉండేవారు కారేమో? కనుక పవన్ కళ్యాణ్ ఈ ఆలోచన కలిగించేలా చేసింది ప్రొ.నాగేశ్వర్, ఆ మీడియా ప్రతినిధులే అని చెప్పక తప్పదు.
కానీ తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజేపి, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీల ప్రభావం ప్రజలపై ఉన్నప్పుడు వారు జనసేనని పట్టించుకుంటారా? ఆ నాలుగు పార్టీల మద్య ఆధిపత్యపోరు కొనసాగుతున్నప్పుడు తెలంగాణలో జనసేనని పవన్ కళ్యాణ్ నిలబెట్టగలరా? అసలు పవన్ కళ్యాణ్ జనసేనని యాక్టివ్ చేయాలనే ఆలోచనతో ఈ సభ నిర్వహించబోతున్నారా లేక కేవలం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఈ సభ నిర్వహించబోతున్నారా? అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానాలు లభిస్తాయి.