మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలు

May 19, 2026
img

పెట్రోల్, డీజిల్‌ ధరలు మళ్ళీ పెరిగాయి. నాలుగు రోజుల క్రితం రెండింటిపై లీటరుకి రూ.3 చొప్పున పెంచిన చమురు సంస్థలు ఈసారి లీటరుకి 90 పైసలు చొప్పున పెంచాయి. పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచిన తర్వాత ప్రజలపై ఆ భారం తగ్గించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా వాటిపై ఎక్సైజ్ సుంకం వసూలు నిలిపివేసింది. కనుక దానిని సవరించేందుకు రెండింటిపై లీటరుకి90 పైసలు చొప్పున పెంచింది. పెరిగిన ధరలు తక్షణం అమలులోకి వస్తాయి. 

తాజా పెంపు తర్వాత హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరు రూ.110.89 డీజిల్ ధర లీటరుకి రూ.98.96కి చేరింది. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ మళ్ళీ ఇరాన్‌పై యుద్ధానికి సిద్ధమవుతుండటంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి. చమురు సరఫరాలో అనిశ్చితి ఏర్పడినందున ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ఆ ప్రభావం భారత్‌లో ఈవిధంగా స్పష్టంగా కనిపిస్తోంది.

Related Post