విజయ్‌ గెలిస్తే సంతోషమే నాకెందుకు అసూయ?రజనీకాంత్

May 17, 2026


img

కోలీవుడ్‌ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆదివారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. 

“తమిళనాడు ఎన్నికలలో రెండు పెద్ద పార్టీల మీద కొత్త రాజకీయ పార్టీతో విజయ్‌ గెలవడం చూసి మొదట నేను ఆశ్చర్యపోయాను. కానీ చాలా సంతోషించాను. తర్వాత విజయ్‌కి ఫోన్ చేసి అభినందించాను. 

అయితే ఈ విషయం తెలియని కొంత మంది నేను విజయ్‌ సిఎం కాకుండా అడ్డుకునేందుకే ఫలితాలు వెలువడిన తర్వాత డీఎంకే అధినేత స్టాలిన్ ఇంటికి వెళ్ళి కలిశానంటూ నా గురించి తప్పుగా వ్రాశారు. వాటికి నా జవాబు ఏమిటంటే, స్టాలిన్‌తో నా స్నేహం రాజకీయాలకు అతీతమైనది. కనుక అయన ఓడిపోతే బాధపడ్డాను. అందుకే వెళ్ళి కలిశాను తప్ప వేరే దురాలోచనతో కాదు. 

విజయ్‌ నాకు సమ ఉజ్జీకాదు. నా కంటే 25 ఏళ్ళు చిన్నవాడు. ఒకవేళ నేను పార్టీ పెట్టి పోటీ చేసి ఉంటే తప్పకుండా గెలిచేవాడినేమో? కానీ వయసు, ఆరోగ్యం, ఇతర కారణాల వలన ఆ ఆలోచన విరమించుకున్నాను. కనుక నాకు సమ ఉజ్జీ కమల్ హాసన్ గెలిచి ఉంటే అసూయపడేవాడినేమో? 

కానీ నా కంటే చాలా చిన్నవాడైన విజయ్‌ గెలిస్తే సంతోషమే కానీ నేనెందుకు అసూయ పడతాను? నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నాను. వాటితో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. సిఎం విజయ్‌ యువకుడు. రాష్ట్రానికి మేలు చేస్తారని ఆశిస్తున్నాను. ఆయనకు మళ్ళీ మరోసారి అభినందనలు,” అని రజనీకాంత్ అన్నారు.


Related Post