పెద్ది ట్రైలర్‌ అంటూ వరుస ట్రైలర్లు... భలే ఉందే!

May 17, 2026


img

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా చేస్తున్న ‘పెద్ది’ ట్రైలర్‌ రేపు అంటే సోమవారం  ముంబాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఇప్పటికే ఓ వీడియో విడుదల చేశారు. అది కూడా అద్భుతంగా ఉంది. కానీ ట్రైలర్‌ విడుదలంటూ వరుసపెట్టి పెద్ది వీడియోలతో ఇంకా హడావుడి చేస్తూనే ఉంది పెద్ది టీమ్‌.

అదివారం  మరో వీడియో విడుదల చేసింది. ఇదివరకు విడుదల చేసినట్లే రేపు ట్రైలర్‌ అంటూ క్రికెట్ బాల్ ముంబాయిలో పడినట్లు చూపుతూ, మళ్ళీ పెద్ది క్లిప్స్ కలిపి చూపారు. పెద్ది టీమ్‌ చేస్తున్న ఈ హడావుడి చూసి రామ్‌ చరణ్‌ అభిమానులు చాలా సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ముఖ్యంగా పెద్ది సినిమా గురించి నిన్న చిరంజీవి చేసిన ట్వీట్‌, పెద్దిపై అంచనాలు పెరిగిపోయేలా చేసిందని చెప్పవచ్చు. ఈ నెల 23న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పెద్ది ‘స్పెషల్ సాంగ్‌’ విడుదల కాబోతోంది.

ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్‌, కోచ్‌ గౌరు నాయుడుగా శివరాజ్ కుమార్‌ నటిస్తున్నారు. జగపతి బాబు, శివ రాజ్ కుమార్‌, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.  

వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన పెద్ది జూన్ 4న విడుదల ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఒకరోజు ముందుగా ప్రీమియర్స్ చూడవచ్చు.


Related Post

సినిమా స‌మీక్ష