పాపం శ్యామల.. పావలా కూడా లేదు!

May 16, 2026


img

పలు తెలుగు సినిమాలలో నటించి అందరినీ అలరించిన నటి ‘పావలా శ్యామల’ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. శుక్రవారం రాత్రి కూకట్‌పల్లి జంక్షన్ వద్ద రోడ్డు పక్కన కూర్చొని ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఆమె పరిస్థితి చూసి వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి చికిత్స చేయించారు. తర్వాత ఆమెకు ఆశ్రయం కల్పిస్తున్న ఆర్కే ఫౌండేషన్ వారి వృద్ధాశ్రమంలో అప్పజెప్పారు. 

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, శుక్రవారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురవడంతో చికిత్స కోసం సమీపంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్ళారు. కానీ ఆమె వద్ద డబ్బు లేకపోవడంతో చికిత్స చేయడానికి నిరాకరించి, క్యాబ్ బుక్ చేసి పంపించేశారు. కనీసం ఆ క్యాబ్ ఛార్జీ కూడా కట్టలేదు. దాంతో ఆమె వద్ద డబ్బు లేదని తెలుసుకున్న క్యాబ్ డ్రైవర్ ఆమెను రోడ్డు పక్కన దింపేసి వెళ్ళిపోయాడు. 

సినీ పరిశ్రమలో కోట్ల రూపాయలు పారితోషికాలు తీసుకునే నటీనటులున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఉంది. వందల కోట్లు పెట్టి భారీ బడ్జెట్‌ సినిమాలు తీసే నిర్మాతలున్నారు. కానీ పావలా శ్యామలని ఆదుకునేవారే లేరా? అని సినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష