రణవీర్ సింగ్ హీరోగా చేసిన దురంధర్-2 హిందీ సినిమా ఈ ఏడాది మార్చి 19న విడుదలైన అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కనీవినీ ఎరుగని స్థాయిలో ఏకంగా రూ.1800 కోట్లు కలెక్షన్స్ సాధించి భారతీయ సినిమాల కలెక్షన్స్ రికార్డులన్నిటినీ బద్దలు కొట్టింది.
ఇప్పుడీ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది. కానీ ప్రస్తుతానికి విదేశాలలో నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకులు మాత్రమే దురంధర్-2 చూసేందుకు అవకాశం కల్పించింది.
భారత్‌లో జూన్ 5వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ ఓటీటీలో ప్రసారం కాబోతోంది. ఒకరోజు ముందుగా అంటే జూన్ 4వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి ప్రీమియర్ షో మొదలవుతుంది.
దురంధర్-2లో ప్రముఖ బాలీవుడ్ నటీనటులు చాలా మంది నటించారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సార అర్జున్, ఆర్. మాధవన్ తదితరులు కీలకపాత్రలు చేశారు. భారతీయ రా ఏజంట్ దురంధర్ పాకిస్తాన్‌లో ఏవిధంగా విధ్వసం సృష్టించాడనేది ఈ సినిమా కథ.