దేవర తర్వాత జూ.ఎన్టీఆర్ చేసిన బాలీవుడ్ మూవీ వార్-2 నిరాశ పరచడంతో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న యాక్షన్ చిత్రం 'డ్రాగన్'పై చాలా ఆశలు పెట్టుకున్నారు. వారికో శుభవార్త! ఈ నెల 20న జూ.ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా డ్రాగన్ ఫస్ట్ గ్లిమ్స్ విడుదల కాబోతోంది.
ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్‌కి జోడీగా కన్నడ నటి రుక్మిణీ వసంత్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరి కృష్ణ కొసరాజు కలిసి పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2027, జూన్ 11 న విడుదల కాబోతోంది.