మా ఇంటి బంగారం.. మరోసారి వాయిదా!

May 14, 2026


img

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో ‘మా ఇంటి బంగారం’ మొదట మే 15న విడుదల చేయాలనుకున్నారు. కానీ తర్వాత జూన్‌ 4కి వాయిదా పడింది. కానీ ఆరోజున చాలా భారీ అంచనాలతో ‘పెద్ది’ విడుదల కాబోతోంది.

నిర్మాతలు-సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల మద్య పర్సంటేజ్ విధానం విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన నెలకొంది. కనుక ‘మా ఇంటి బంగారం’ జూన్‌ 19కి వాయిదా వేసుకున్నారు.

ఎర్రరంగు పట్టుచీర కట్టుకొని చేతిలో తుపాకీతో ఎవరికో గురిపెడుతున్న సమంత ఫోటో సినిమా కథపై ఆసక్తి రేకెత్తిస్తోంది.      

ఈ సినిమాకు కధ: రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, దర్శకత్వం: నందినీ రెడ్డి, సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: ఓం ప్రకాష్, డైలాగ్స్: ఆర్ట్: స్టంట్స్: లీ విట్టకేర్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల చేశారు.

ఈ సినిమాని సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి కలిసి ట్రాలాలా మూవీ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష