బాలీవుడ్ దర్శకుడు ప్రేమ్ దర్శకత్వంలో ధృవ్ సర్జా హీరోగా చేసిన ‘కేడీ: ది డెవిల్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఓ ముఖ్యపాత్ర చేశారు. ఈ సినిమాలో ఓ పాట లిరిక్స్ చాలా వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రీష్మ నానాయ్య, శిల్పా శెట్టి, రమేష్ అరవింద్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
కెవిఎం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట నారాయణ నిర్మించిన ఈ సినిమాకు సంగీతం: అర్జున్ జన్య, కెమెరా: విలియం డేవిడ్ చేశారు. ఈ నెల 15న విడుదల ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో విడుదల కాబోతోంది.