మా ప్రభుత్వం రేసుగుర్రం.. వేరే గుర్రాలు అవసరం లేదు!

May 13, 2026


img

నేడు తమిళనాడు శాసనసభలో జరిగిన బలపరీక్షలో సిఎం విజయ్‌ 144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో నెగ్గిన తర్వాత డీఎంకే, అన్నాడీఎంకేల విమర్శలకు జవాబు చెపుతూ, “రాష్ట్రంలో ఒక కోటి 72 లక్షల మంది మాపై నమ్మకం ఉంచి ఓట్లు వేసి గెలిపించారు. ప్రజలకిచ్చిన హామీ ప్రకారం సామాన్యుల కోసం రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేశాను. మా ప్రభుత్వమే రేసు గుర్రంలా పరిగెడుతుంది. మాకు వేరే గుర్రాలు కొనాల్సిన అవసరం లేదు. 

సామాన్య ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా పాలన సాగిస్తాము. చక్కటి పాలన, మంచి సంక్షేమ పదకాలు అమలు చేస్తాం. మా ప్రభుత్వం లౌకిక వాదానికి, సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తుంది. మాది అస్తిర ప్రభుత్వం కాదని ముందే చెప్పాను. ఇప్పుడూ చెప్తున్నాను. మా ప్రభుత్వం పూర్తి 5 ఏళ్ళు అధికారంలో ఉంటుంది.

గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుతూనే, అది ప్రవేశపెట్టిన మంచి పథకాలను అమలుచేస్తాం,” అని సిఎం విజయ్‌ అన్నారు.


Related Post