అమెరికా-ఇరాన్ యుద్ధ వార్తలతోనే భారతీయ స్టాక్ మార్కెట్ తీవ్రంగా నష్టపోయింది. ఇంకా నష్టపోతూనే ఉంది. ప్రధాని మోడీ మొన్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో దేశ ప్రజలు బంగారం, పెట్రోల్, డీజిల్ కొనుగోలు, వినియోగం తగ్గించాలంటూ ఇచ్చిన పిలుపుతోనే నేడు మరోసారి స్టాక్ మార్కెట్లో మరోసారి పెద్ద కుదుపు వచ్చింది. ఇవి సరిపోవన్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మరికొంత నిప్పు రాజేశారని చెప్పక తప్పదు.
“అమెరికా-ఇరాన్ యుద్ధం వలన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. కానీ మా ప్రభుత్వం చాలా ముందు చూపుతో భారీగా చమురు నిల్వలు సిద్ధంగా ఉంచుకున్నందున ప్రజలపై ఆ అదనపు భారం పడకుండా నిలువరించాము. కానీ పశ్చిమాసియాలో యుద్ధం ఇలాగే కొనసాగితే ముడి చమురు ధరలు ఇంకా పెరుగుతాయి. అప్పుడు చమురు కంపెనీలకు లక్ష కోట్ల వరకు నష్టం వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపధ్యంలో ప్రధాని మోడీ చేసిన ఆయిల్ పొదుపు దేశ ప్రజలందరికీ ఓ మేల్కొలుపు వంటిది,” అని అన్నారు.
కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చేసిన తాజా వ్యాఖ్యలు షేర్ మార్కెట్ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.