ఇటీవల తమిళనాడు సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ నేడు శాసనసభలో బల నిరూపణ చేసుకొని విజయం నాలుగు రోజుల క్రితం ఇద్దరు ఎమ్మెల్యేలున్న చిన్న పార్టీల చుట్టూ మద్దతు కోసం తిరిగి కష్టపడి మ్యాజిక్ ఫిగర్ 119 సాధించగలిగారు. కానీ నేడు అన్నాడీఎంకే తిరుగుబాటు చేసిన 25 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో విజయ్ ప్రభుత్వానికి మద్దతు పలకడంతో 144 మంది మద్దతుతో బలపరీక్షలో నెగ్గారు.
సిఎం విజయ్ అప్పుడే అనైతిక రాజకీయాలు చేశారంటూ అన్నాడీఎంకే జనరల్ సెక్రెటరీ పళనిస్వామి విమర్శించగా, ప్రభుత్వం ఏర్పాటుకి తమ మిత్రపక్షాల చేత విజయ్‌కి మద్దతు ఇప్పిస్తే ఆయన తొలిరోజునే తప్పుడు మార్గంలో ప్రయాణం మొదలుపెట్టారని డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో 3.1 కోట్ల మంది టీవీకే పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అంటే రాష్ట్ర జనాభాలో 65 శాతం మంది విజయ్‌ని తిరస్కరించారు. కానీ ఈవిధంగా హార్స్ ట్రేడింగ్ చేసి అధికారం నిలుపుకున్నారు,” అని ఉదయనిధి స్టాలిన్ విమర్శించారు. అనంతరం డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల సభ్యులు వాకవుట్ చేసి వెళ్ళిపోయారు.
తర్వాత స్పీకర్ ఓటింగ్ నిర్వహించగా టీవీకే పార్టీకి అనుకూలంగా 144, వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. దీంతో విజయ్ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గిందని స్పీకర్ ప్రభాకర్ ప్రకటించారు.