తమిళనాడులో విజయ్‌ మార్క్ పాలన షురూ!

May 12, 2026


img

తమిళనాడు సిఎం విజయ్‌ తన మార్క్ పాలన షురూ చేశారు. రాష్ట్రంలో దేవాలయాలు, ఇతర మతాల ప్రార్ధనా మందిరాలు, పాఠశాలలు, కాలేజీలు, బస్టాండ్ల సమీపంలోని 500 మీటర్లలోపుగా ఉన్న మద్యం దుకాణాలు తొలగించాలని ఆదేశించారు. వీటి తొలగింపుకి రెండు వారాలు సమయం ఇచ్చారు. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పోరేషన్ లెక్కల ప్రకారం 717 మద్యం దుకాణాలు నిషేదిత ప్రదేశాలలో ఉన్నాయి. సామాన్య ప్రజలు, మహిళలు, విద్యార్ధులు శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని ఈ నిర్మాయం తీసుకున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. 

ఈ నిర్ణయంపై సదరు మద్యం దుకాణాల వ్యాపారులు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తుంటే, ఆయా ప్రాంతాలలో ప్రజలు, కోలీవుడ్‌లోని కమల్ హాసన్ వంటి పలువురు సినీ ప్రముఖులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా సిఎం విజయ్‌ని అభినందిస్తున్నారు.     



Related Post