ప్రధాని మోడీ నేడు తెలంగాణ పర్యటనలో రూ. 9,377 కోట్లు వ్యయంతో రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. హెచ్ఐసీసీలో జరిగే ఈ కార్యక్రమంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు పాల్గొనబోతున్నారు. వాటి వివరాలు..
1.వరంగల్‌లో రూ.1,695.కోట్లు వ్యయంతో నిర్మించిన ‘పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు.
2.హైదరాబాద్ శివారులో మల్కాపురం వద్ద రూ. కోట్లు వ్యయంతో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ పీఓఎల్.
3.జహీరాబాద్‌లో రూ.2,360.54 కోట్లు వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ.
4.రూ. 1,243 కోట్లు వ్యయంతో 118 కిమీ నిర్మించిన కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్ట్.
5.రూ. 292 కోట్లు వ్యయంతో 21 కిమీ కాజీపేట రైల్ అండ్ రైల్ బైపాస్ రైల్వే లైను
6.రూ. 3,175 కోట్లు వ్యయంతో జాతీయ రహదారి 167 విస్తరణలో భాగంగా గుడేబల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు నిర్మాణ పనులు.