బ్లాక్ అండ్ వైట్‌ డ్రెస్సులో విజయ్‌.. సిఎంగా ప్రమాణ స్వీకారం

May 10, 2026


img

తమిళనాడు రాజకీయ నాయకులు తెల్లటి పంచెలు, ఖద్దరు చొక్కాలే ధరిస్తుంతారు. కానీ టీవీకే పార్టీ అధినేత విజయ్‌ ఆ సాంప్రదాయానికి భిన్నంగా సినిమా హీరోలాగే నల్ల ప్యాంట్‌లో టక్ చేసిన తెల్ల షర్ట్, బ్లాక్ సూట్ ధరించి తమిళనాడు సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.  

ఈ కార్యక్రమానికి హాజరైన సినీ నటి త్రిష మాత్రం సాంప్రదాయం ప్రకారం నీలం రంగు చీర, మేడలో వజ్రాల నెక్లెస్ ధరించారు. టీవీకే పార్టీ ఎన్నికలలో గెలిచినప్పటి నుంచీ ఆమెకు డెప్యూటీ సిఎం పదవి అని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. కానీ అవన్నీ ఊహాగానాలే అని నేడు స్పష్టమైంది. 

టీవీకే పార్టీకి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇచ్చి ఇద్దరు మంత్రులతో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది గనుక కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ కూడా విజయ్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.   



Related Post