తొలి ప్రయత్నంలోనే 108 సీట్లు గెలుచుకొని కాలర్ ఎగరేసిన టీవీకే పార్టీ అధినేత విజయ్‌కి ఆ సంతోషం రెండు రోజులలోనే ఆవిరైపోతోంది. ఈరోజు సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ని కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిపి 112 మంది సంతకాలు చేసిన మద్దతు లేఖని సమర్పించగా, ప్రభుత్వం ఏర్పాటుకి అవసరమైన 118 మంది ఎమ్మెల్యేలను ఏర్పాటు చేసుకొని రమ్మనమని చెప్పినట్లు తెలుస్తోంది. అంటే విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించనని సున్నితంగా చెప్పినట్లే.
మొదట టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామని వచ్చిన వామపక్షాలు, మరో రెండు పార్టీలు కూడా హటాత్తుగా నిరాకరించినట్లు తెలుస్తోంది.
దీంతో డీఎంకే లేదా అన్నాడీఎంకే మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. కానీ వాటి మద్దతు తీసుకునేందుకు విజయ్ ఇష్టపడటం లేదని సమాచారం. కనుక రేపు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారం జరుగుతుందో లేదో తెలీని పరిస్థితి ఏర్పడింది.