వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ ప్రధాన పాత్రలో ‘రావు బహదూర్’ జూన్ 5న విడుదల కావాల్సి ఉండగా జూలై 3కి వాయిదా పడింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. భారీ అంచనాలతో ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ‘పెద్ది’ జూన్ 4కి మారడంతో రావు బహద్దూర్ వాయిదా తప్పలేదు.
ఈ సినిమాలో సత్యదేవ్ ‘రావు బహదూర్’గా నటిస్తున్నారు. వృద్ధుడైన రావు బహదూర్‌కి తన వంశాకురం గురించి కలిగిన అనుమానం చుట్టూ అల్లుకున్న కథ ఇదని పోస్టర్లు, వాటి క్యాప్షన్ ద్వారా చూచాయగా చెప్తున్నారు దర్శకుడు వెంకటేష్ మహా. అవునో కాదో ట్రైలర్‌లో చెప్పెయవచ్చు.
ఈ సినిమాలో వికాస్ ముప్పల, దీప థామస్, బాలీవుడ్ పరసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినినిమాకు కథ, దర్శకత్వం, ఎడిటింగ్: వెంకటేష్ మహా, సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: కార్తీక పర్మర్, కోరియోగ్రఫీ: శ్రావణ్ ముప్పిరి చేస్తున్నారు.
ఈ సినిమా నిర్మాణంలో మహేష్ బాబు కూడా భాగస్వామిగా ఉన్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మహాయాన బ్యానర్లపై చింత గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కలిసి నిర్మిస్తున్న ‘రావు బహదూర్’ జూలై 3న విడుదల కాబోతోంది.