తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంటే, భారీ మెజార్టీతో బిజేపి అధికారంలోకి వచ్చిన పశ్చిమ బెంగాల్లో అప్పుడే ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ పూర్తయింది. నేడు కోల్‌కత్తాలోని బిజేపి ప్రధాన కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బిజేపి శాసనసభ్యులు సమావేశమై సువేందు అధికారిని తమ నాయకుడుగా ఎన్నుకున్నారు.
ఆయన వారికి, వారు ఆయనకి పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. పశ్చిమ బెంగాల్ సిఎంగా తనని ఎంపిక చేసినందుకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
అనంతరం గవర్నర్‌ని కలిసి ఈవిషయం తెలియజేయగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. కనుక శనివారం ఉదయం 11 గంటలకు సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు ఇద్దరు మహిళా ఎమ్మెల్యే డెప్యూటీ సిఎంలుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.