కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో నేడు బిజేపి-బీఆర్ఎస్ కార్యకర్తల మద్య ఘర్షణ జరిగింది. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్యాంప్ కార్యాలయంపై బిజేపి కార్యకర్తలు కర్రలు, రాళ్ళతో దాడి చేసేందుకు ప్రయత్నించగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎదురు దాడికి దిగారు.
ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టి అతికష్టం మీద పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఇటీవల ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని ఉద్దేశ్యించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకు ఆగ్రహించిన ఆయన అనుచరులు ఆయన కార్యాలయంపై దాడికి సిద్ధపడ్డారు.
అయితే బండి సంజయ్ కూడా మా నాయకుడుని ఉద్దేశ్యించి అనుచితంగా మాట్లాడారు. తిరిగి బిజేపి గూండాలు మాపై దాడులు చేస్తున్నారు,” అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.