బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా చేస్తున్న పెద్ది సినిమా జూన్ 4న విడుదల కాబోతోంది. కనుక అప్పుడే పెద్ది హడావుడి మొదలైంది. బుచ్చిబాబు, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల మీడియా ప్రతినిధులకు పెద్ది అప్‌డేట్ ఇచ్చారు.
బుచ్చిబాబు మాట్లాడుతూ, “పెద్ది ఎడిటింగ్ వర్క్ అంతా పూర్తయిపోయింది. ఎడిటింగ్ తర్వాత కాపీ చూసి అందరం చాలా చాలా హ్యాపీ. అభిమానులు కూడా పెద్దిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. జూన్ 4న సినిమా, ఒకరోజు ముందుగా ప్రీమియర్స్ చూడవచ్చు. ఓవర్సీస్‌లో నేటి నుంచే పెద్ది అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయి,” అని చెప్పారు.
ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల కూడా మీడియా ప్రతినిధులకు అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోయే అప్‌డేట్ ఇచ్చారు. 1970-80 సంవత్సరాల మద్య కాలంలో విజయనగరంలో పొలం గట్లపై కూర్చొని క్రికెట్ చూస్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో, రేపు సినిమా థియేటర్లలో పెద్ది ఆటని చూస్తున్నప్పుడు కూడా సరిగ్గా అలాంటి ఫీలింగ్ కలుగుతుంది,” అని అన్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్, కోచ్ గౌరు నాయుడుగా శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందించారు. త్వరలోనే పెద్ది ట్రైలర్ విడుదల కాబోతోంది.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు.