సందీప్ కిషన్ 33వ సినిమా కాన్సెప్ట్ పోస్టర్

May 08, 2026


img

యువ నటుడు సందీప్ కిషన్ 33వ సినిమా మొదలుపెడుతున్నారు. తాజాగా ‘శంబాల’తో హిట్ కొట్టిన యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ నిన్న సందీప్ కిషన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. 

‘ఏ లెజెండ్ ఈజ్ బార్న్’ అంటూ విడుదల చేసిన పోస్టర్లో కారడవిలో పొత్తిళ్ళలో ఉన్న పసిబిడ్డ... ఆ బిడ్డని చూస్తున్న సింహం, పక్కనే ఖడ్గం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ మొదలు పెట్టి డిసెంబర్‌ నెలాఖరులోగా సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఈ సినిమాని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.   


Related Post

సినిమా స‌మీక్ష