ప్రముఖ నటి భాగ్యశ్రీ బోర్సే పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న రెండు సినిమాలవి రెండు ఫస్ట్ లుక్ పోస్టర్స్ నేడు విడుదలయ్యాయి. వాటిలో ఒకటి అక్కినేని అఖిల్‌తో చేస్తున్న లెనిన్ నుంచి కాగా మరొకటి కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్‌తో చేస్తున్న ‘సియాన్’ సినిమా పోస్టర్.
అయితే లెనిన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె నెత్తిన కిరీటం, మూతికి మీసంతో రాజదుస్తులలో పౌరాణిక పురుష వేషంలో చూపడంతో ఈ సినిమాలో ఆమె పాత్రపై ఆసక్తి కలిగించగలిగారు.
శివ కార్తికేయన్‌తో చేస్తున్న ‘సియాన్’ సినిమా పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. గాజుల దుకాణంలో పొడవాటి నెమలి ఈకలు పట్టుకొని కూర్చున్నట్లు చూపారు.
అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా చేస్తున్న ‘లెనిన్’ జూన్ 26వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే.
మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో సిద్ధమవుతున్న ఈ సినిమాకి సంగీతం: తమన్, కెమెరా: ఐ నవీన్ కుమార్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
ఈ సినిమాని అన్నపూర్ణా స్టూడియోస్, సీతారా ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై అక్కినేని కుటుంబం, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు.