సర్ పేరుతో ఓట్లు చోరీ: మమతా బెనర్జీ

May 04, 2026


img

పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండా ఎగరేయాలని పట్టుదలగా ప్రయత్నించిన బిజేపి ఎట్టకేలకు ఈసారి మూడో ప్రయత్నంలో విజయం సాధించింది. మొత్తం 234 సీట్లు ఉన్నందున ప్రభుత్వం ఏర్పాటుకి కనీసం 118 అవసరం కాగా బిజేపి 22 సీట్లు గెలుచుకొని మరో 175 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. కనుక పశ్చిమ బెంగాల్ తొలిసారిగా బిజేపి భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం తధ్యం. 

మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ 3 సీట్లు గెలుచుకొని మరో 88 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు పశ్చిమ బెంగాల్‌ని పాలించిన వామపక్ష పార్టీ ఒకే ఒక్క సీటు గెలుచుకొని మరొక్క చోట ఆధిక్యంలో ఉంది.    కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఒకే ఒక్క చోట ఆధిక్యంలో ఉంది.

ఈ ఫలితాలపై సిఎం మమతా బెనర్జీ స్పందిస్తూ, “సర్ పేరుతో ఓట్లు దొంగతనం చేసి బిజేపి దొడ్డి దారిలో అధికారంలోకి రావాలని ప్రయత్నించింది. ఓట్ల లెక్కింపుపై నేను మొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాను. ఇప్పుడే అదే జరుగుతోంది.

మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే అనేక చోట్ల బిజేపి నేతలు కౌంటింగ్ కేంద్రాలు మూయించేస్తున్నారు. బిజేపికి కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు, కేంద్ర ఎన్నికల కమీషన్‌ అందరూ సహకరిస్తున్నారు.

కానీ ఓట్ల లెక్కింపు అన్ని రౌండ్లు సక్రమంగా జరిగితే మా పార్టీయే గెలుస్తుందనే నమ్మకం నాకుంది. కనుక ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు పార్టీ ఏజంట్లు ఎవరూ కౌంటింగ్ కేంద్రాల వద్ద నుంచి కదలొద్దు,” అని మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.


Related Post