హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ‘ఫౌజీ’ అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయిందని దర్శకుడు హను స్వయంగా మీడియాకు తెలియజేశారు. కనుక రెండు మూడు నెలల్లో మిగిలిన 20 శాతం కూడా పూర్తి చేసి కుదిరితే ఈ దసరా దీపావళి పండుగ సీజన్లో లేదా డిసెంబర్‌లోగా ఎట్టి పరిస్థితులలో ఫౌజీ విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నామని హను చెప్పారు. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలు షూటింగ్ జరుగుతున్నట్లు తెలిపారు.
ఆయన చెప్పినట్లు దసరా దీపావళికి కుదరక పోయినా డిసెంబర్‌లోగా విడుదల చేస్తే చాలు అభిమానులు చాలా సంతోషిస్తారు. ఈ సినిమా కోసం ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలలో వీలైనంత వరకు డూప్, బాడీ డబుల్ లేకుండా చేస్తున్నారు.
1930-47 మద్య రెండో ప్రపంచ యుద్ధం నేపధ్యంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన ఓ సైనిక యోధుడుగా ప్రభాస్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు హనీ రాఘవపూడి ఇది వరకే చెప్పారు. కానీ రెండు భాగాలలో ప్రభాస్ పాత్ర తీరు, పూర్తిగా భిన్నంగా ఉంటుందని చెప్పారు.
ఫౌజీలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తుండగా, జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపం ఖేర్, భాను చందర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ప్రభాస్‌తో సినిమా అంటే అది తప్పనిసరిగా పాన్ ఇండియా మూవీయే. కనుక రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. ఫౌజీ ఈ ఏడాది ఆగస్ట్ 14న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ కాస్త ఆలస్యమవుతుందేమో?