లావణ్య కొణిదెల వారి సతీ లీలావతి ట్రైలర్‌

May 02, 2026


img

లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలిలో కోడలుగా మారిన తర్వాత రిలీజ్ అవుతున్న చిత్రం సతీ లీలావతి. తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో దేవ్ మోహన్, నరేష్, విటివి గణేష్, సప్తగిరి, రాజేంద్రన్, జాఫర్ సిద్దిఖీ, తాగుబోతు రమేష్ జోషి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.

ఈ చిత్రం ట్రైలర్‌ నేడు విడుదలైంది. సినిమా టైటిల్‌తోనే కథ ఏమిటో అర్ధమవుతుంది. చక్కటి కామెడీతో ఫ్యామిలీ డ్రామా ట్రైలర్‌తో మరికాస్త స్పష్టత ఇచ్చారు.   

ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జే మేయర్, కొరియోగ్రఫీ: బ్రిందా, శ్రవణ్, కెమెరా: బైనేంద్ర మీనన్, డైలాగ్స్: ఉదయ్, ఆర్ట్: విటల్, స్టంట్స్: జీవన్, ఎడిటింగ్: సతీష్ సూర్య చేశారు.    

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగ మోహన్ నిర్మించిన సతీ లీలావతి మే 8న విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష