రామ్ చరణ్-జాన్వీ కపూర్ జంటగా చేస్తున్న ‘పెద్ది’ సినిమా జూన్‌లో విడుదల చేస్తామని ప్రకటించారు కానీ సరిగ్గా ఎప్పుడో చెప్పలేదు. దర్శకుడు బుచ్చిబాబు గురువుగారు సుకుమార్ ఈరోజు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి జూన్ 4న పెద్ది రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఒకరోజు ముందుగా ప్రీమియర్స్ ఉంటాయని చెప్పారు.
“మై లిటిల్ డైరెక్టర్ బుచ్చిబాబు ఎలాంటి సినిమా అయినా చేయగలదని ‘ఉప్పెన’తోనే నిరూపించుకున్నాడు. పెద్ది కమర్షియల్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. అలాగే భావోద్వేగాలు కూడా. రెంటినీ బ్యాలన్స్ చేసుకుంటూ పెర్ఫెక్ట్ సినిమా తీయడం చాలా కష్టం. కానీ తీసి చూపించాడు. ఇలాంటి ఎమోషనల్ రైడ్ మూవీ ఈ మధ్యకాలంలో రాలేదని భావిస్తున్నాను. ఈ సినిమాలో రామ్ చరణ్ డాన్స్, నటన రెండూ అద్భుతంగా చేశారు,” అని సుకుమార్ అన్నారు.
బుచ్చిబాబు మాట్లాడుతూ, “చెప్పిన సమయానికి సినిమా రిలీజ్ చేయలేకపోయినందుకు ముందుగా అందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నాను. జూన్ 4న పెద్ది చూసిన తర్వాత అది మన హృదయాలలో సెటిల్ అయిపోతుంది. దానిని మరిచిపోవడం అంత తేలిక కాదు రామ్ చరణ్ సర్‌పై నాకున్న ప్రేమను జూన్ 4న పెద్దిలో చూసి ఆశీర్వదించండి,” అని అన్నారు.
ఐటెం సాంగ్‌కి తగిన హీరోయిన్ ఎంపికలో ఆలస్యం అవడం వలన పెద్ది షూటింగ్ ఆలస్యమైంది. కానీ ఇప్పుడు అది కూడా పూర్తయిపోయింది. కనుక రిలీజ్ డేట్లో ఇక మార్పులు ఉండవు.
ఈ సినిమాలో కోచ్ గౌరు నాయుడుగా శివరాజ్ కుమార్, ఇంకా జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 4న విడుదల కాబోతోంది.