కన్న తండ్రిని విమర్శించడం తగునా కవితా? దానం ప్రశ్న

May 02, 2026


img

టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తండ్రి కేసీఆర్‌ని ఉద్దేశ్యించి మర మనిషి అంటూ విమర్శిస్తే, ఆమె సోదరుడు, బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందించలేదు. కేసీఆర్‌ కూడా స్పందించలేదు. బీఆర్ఎస్‌ పార్టీ నేతలెవరూ కూడా స్పందించలేదు. కానీ కాంగ్రెస్‌ పార్టీలోకి మారిన బీఆర్ఎస్‌ పార్టీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ స్పందించారు. 

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఆమె పార్టీ పెట్టుకొని రాజకీయాలు చేసుకోవడం తప్పు కాదు. కానీ కన్న తండ్రిని ఉద్దేశ్యించి పదేపదే అనుచితంగా మాట్లాడుతుండటం సరికాదు. మరో పదేళ్ళపాటు ఆరోగ్యంగా జీవించాల్సిన కేసీఆర్‌ని ఆమె తన మాటలతో క్షోభ పెడుతూ మానసికంగా దెబ్బ తీస్తున్నారు. 

కేసీఆర్‌ మాస్ లీడర్. ఆయనకు ఎప్పుడు బయటకు రావాలో.. ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. కల్వకుంట్ల కవిత ఆయనకు రాజకీయ పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదు. అయన బయటకు వచ్చి నోరు విప్పితే మొట్ట మొదట ఆమె... టీఆర్ఎస్‌ పార్టీయే  తుడిచిపెట్టుకుపోతుందని గ్రహిస్తే మంచిది,” అని దానం నాగేందర్‌ హితవు పలికారు.


Related Post