గోపీచంద్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వం ‘భరతవర్ష’ చేస్తున్నాడు. ఇది చేస్తుండగానే తన 34వ సినిమాకి కొబ్బరికాయ కొట్టేయబోతున్నారు. స్టంట్ మాస్టర్ వెంకట్ దర్శకత్వంలో గోపీచంద్ కొత్త సినిమాకి అదివారం పూజా కార్యక్రమం జరుగబోతోంది. ఇది స్టంట్ మాస్టర్ వెంకట్ తీస్తున్న సినిమా కనుక ఇది ఖచ్చితంగా యాక్షన్ సినిమా అయ్యే ఉంటుంది... అని తెలియజేస్తూ అస్తమిస్తున్న సూర్యుడికి ఎదురుగా కొండ శిఖరం అంచున నిలబడున్న పులి బొమ్మతో చక్కటి పోస్టర్ వేశారు.
70 ఎంఎం ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతం: సామ్ సిఎస్, కెమెరా: సామ్‌దత్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు.