అడవి శేష్, మృణాళినీ ఠాకూర్ జంటగా చేసిన డెకాయిట్-ఒక ప్రేమ కధ’ గత నెల 10న థియేటర్లలో విడుదలైంది. ఇంతకు ముందు అడవి శేష్ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవడంతో దీనిపై చాలా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ వాటిని అందుకోవడంలో డెకాయిట్ తడబడ్డారు. మిశ్రమ స్పందన దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేస్తోంది. ఈ నెల 8 నుంచి ప్రసారం కాబోతోంది.
షానీల్ డియో దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జాన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియా యార్లగడ్డ, సునీల్ నారంగ్ కలిసి డెకాయిట్ తెలుగు, హిందీ భాషలలో నిర్మించారు.
డెకాయిట్ కథ ఏమిటంటే... ఓ హత్య కేసులో 13 ఏళ్ళు జైలు శిక్ష అనుభవిస్తున్న హరిదాస్ (అడవి శేష్) తప్పించుకుంటాడు. దుబాయ్ పారిపోయెందుకు అర్జెంటుగా 60 లక్షలు అవసరం పడుతుంది. కనుక అది సమకూర్చుకునేలోగా తనని జైలుకి పంపిన మాజీ ప్రేయసి సరస్వతి (మృణాల్ ఠాకూర్)పై పగ తీర్చుకోవాలనుకుంటాడు. కానీ అక్కడ ఆమె దయనీయమైన పరిస్థితిలో ఉంటుంది. పగ తీర్చుకోవాలని వచ్చిన హరిదాస్ తర్వాత ఆమెతోనే ఎందుకు మరో పనిలో దిగుతాడు? ఇద్దరూ ఏవిధంగా చిక్కుల్లో పడ్డారు? చివరికి ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.